ETV Bharat / state

కర్నూలు ప్రజలకు కష్టంగా.. అసంపూర్తి వంతెనలు - కర్నూల్లో ఆగిన వంతెన నిర్మాణాలు

అభివృద్ధికి బాటలు పరవాల్సిన వంతెనలు ప్రతిబంధకాలుగా మారాయి. ట్రాఫిక్‌ కష్టాలు తీర్చాల్సిన వారధులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా... ప్రభుత్వాలు మారుతున్నా.... బ్రిడ్జిల నిర్మాణాలు నిలిచిపోయి సమస్యల్ని పెంచాయి. కర్నూలు ప్రజల వంతెన కష్టాలపై ప్రత్యేక కథనం.

incomplete bridges
కర్నూల్లో ఆగిన వంతెనల నిర్మాణం
author img

By

Published : Apr 6, 2021, 10:07 AM IST

ఎప్పుడో పూర్తికావాల్సిన వంతెనల నిర్మాణాలు ఆగిపోవడం.. కర్నూలు ప్రజల్ని తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ కష్టాల్ని తగ్గించేందుకు చేపట్టిన నిర్మాణాలు నత్తనడకన సాగుతూ.. మరింత రద్దీ పెంచుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు... సర్కారు మారక పడకేశాయి. రాజ్‌విహార్‌ కూడలిలో రద్దీ తగ్గించడంతో పాటు.. కొత్త బస్టాండ్‌ నుంచి నేరుగా కలెక్టరేట్‌ వైపు వెళ్లేందుకు హంద్రీ నదిపై... ఆనంద్‌ టాకీస్‌ వద్ద మూడేళ్ల క్రితం వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారాక.... బిల్లులు చెల్లించకపోవడంతో.. గుత్తేదారు పనులు ఆపేశారు.

కర్నూల్లో ఆగిన వంతెనల నిర్మాణం

గుత్తి పెట్రోల్‌ బంకు నుంచి బిర్లాగేట్‌ వరకు 20 కోట్ల రూపాయలతో చేపట్టిన పైవంతెన పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. పనుల కారణంగా ఒకే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వెంకటరమణ కాలనీ సమీపంలో.. బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనుల్లోనూ రెండేళ్ల నుంచి పురోగతి లేదు. దుమ్ము-ధూళితో వాహనదారులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలూ అధికమయ్యాయి.

జోహరాపురం- ఓల్డ్‌ సిటీకి మధ్య హంద్రీ నదిపై ఉన్న వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనికి పరిష్కారంగా గత ప్రభుత్వం.. మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం మారాక పనులు ఆగిపోయాయి. కార్పొరేషన్‌ ఎన్నికల వేళ హడావుడిగా పనులు చేపట్టినా.. అవసరం తీరాక పనులు మళ్లీ అటకెక్కాయి. జోహరాపురం సహా చుట్టుపక్కల ప్రజల రవాణా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాది క్రితం కర్నూలు వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.... వంతెన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. వర్షకాలం వచ్చేలోగా.. వంతెన పనులు పూర్తిచేయాలని కర్నూలు నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండీ... ఉప ఎన్నికకు రెండు ఈవీఎంలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.