ETV Bharat / state

fevers: జ్వరాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

కర్నూలు జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆసుపత్రుల్లో పడకలు సరిపోక.. ఒకే పడకమీద ఇద్దరు, ముగ్గురు వైద్యం పొందాల్సి వస్తోంది. బాధితుల్లో చిన్నారులు అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

viral fevers
విషజ్వరాలు
author img

By

Published : Sep 10, 2021, 3:28 PM IST

విషజ్వరాలు

కర్నూలు జిల్లాలో డెంగీ పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలు సర్వజన ఆస్పత్రి సహా నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జలుబు, జ్వరంతో వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. విషజ్వరాలు కావటంతో..ఆసుపత్రుల్లో పడకలు సరిపోవటం లేదు. పిల్లల ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ప్లేట్‌లెట్స్ పూర్తిగా పడిపోతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

ఓ వైపు కరోనా వైరస్‌ వణికిస్తుంటే..మరోవైపు వర్షాల కారణంగా పారిశుద్ధ్యం కుంటుపడింది. ఫలితంగా ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండటం, మురుగునీటిలో.. దోమల వ్యాప్తి పెరిగిపోవటంతో.. జ్వరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వాతావరణం సైతం చల్లగా ఉండటంతో జలుబు, జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలు వస్తుండటంతో.. కరోనా కావచ్చనే భయంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. పరీక్షల్లో ఎక్కువ డెంగీ ఉన్నట్లు నిర్ధరణ అవుతోంది. అక్కడక్కడా మలేరియా కేసులు సైతం నమోదవుతున్నాయి. దోమల కారణంగా డెంగీ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఆగస్టు నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. వైరల్‌ ఫీవర్‌ ఈ సీజన్లో కాస్త ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అన్ని కేసులను స్క్రీనింగ్‌ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రజలు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యలు సూచిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్యం మెరుగుపరిస్తేనే విష జ్వరాల నుంచి ప్రజలు బయటపడే అవకాశం ఉంది. లేదంటే మరింతమంది జ్వరాలబారినపడే ప్రమాదం లేకపోలేదు.

ఇదీ చదవండీ.. group fight: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.