యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్లే తమ కుటుంబంపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. ప్రజాసమస్యలపై మాట్లాడినందుకు తమ గొంతునొక్కుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలతో గవర్నర్‌ను కలుస్తానని అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే... ఎస్పీనే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: భర్త కోసం పోలీసులపై అఖిల ప్రియ ఫైర్...