కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు చెందిన చంద్రన్నకు ఇద్దరు భార్యలు. మెుదటి భార్య చనిపోవటంతో ఆయన వెంకటేశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మెుదటి భార్యకు ఓ కుమారుడు, కూతురు ఉండగా.., రెండో భార్యకు ఇద్దరు కుమారులు సంతానం. చంద్రన్న అందరికీ వివాహం చేసి..ఆస్తిని సమానంగా పంచాడు.
కాగా.. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయని మెుదటి భార్య కుమారుడు మల్లేశ్.. కొంత కాలంగా చంద్రన్నతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్య గాయత్రితో కలిసి చంద్రన్నపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనపై రెండో భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి
Cruel Son: ఆస్తి కోసం కొడుకు కర్కశత్వం..తల్లిని కర్రతో కొడుతూ.. కాలితో తన్నుతూ