ETV Bharat / state

కర్నూలు పోలీస్​స్టేషన్‌లో దొంగలుపడ్డారు.. విలువైన వెండి ఆభరణాలు మాయం - Kurnool District police departments news

At Kurnool Taluka Urban Police Station robbery: కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు రూ.75 లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. బీరువాలో దాచిన 105 కిలోల వెండి, డబ్బు కనిపించకపోవడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఎవరు వాటిని దొంగిలించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 30, 2023, 12:16 PM IST

At Kurnool Taluka Urban Police Station robbery: ఇంట్లో ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం.. మరి ఆ పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే.. ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి..? దొంగతనం చేసిన వారిని పట్టుకొని స్టేషన్‌లో బంధించాల్సిన పోలీసులు.. ఆ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే ఎవరిని బంధించాలి..?. సరిగ్గా అలాంటి ఘటనే కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవలే జరిగింది. ఏకంగా రూ. 75 లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.

105 కిలోల వెండి ఆభరణాలు, 2లక్షల 5వేల నగదు సీజ్‌: వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రూ. 75 లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో.. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ. 2 లక్షల 5 వేల నగదును పోలీసులు సీజ్‌ చేశారు.

నిర్ఘాంత పోయిన సీఐ: సీజ్ చేసిన ఆ ఆభరణాలను, నగదును పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఓ బీరువాలో దాచారు. ఈ క్రమంలో ఇటీవల సదరు యజమానులు న్యాయస్థానం నుంచి అనుమతి పొంది పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని వెండి, నగదు అప్పగించాలని కోరారు. దాంతో ప్రస్తుత సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూడగా.. బీరువాలో 105 కిలోల వెండి, నగదు లేకపోవడంతో నిర్ఘాంతపోయారు. సొత్తు సీజ్‌ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు సీఐలు బదిలీ కావడంతో వారిని పిలిపించి విచారించటం మొదలుపెట్టారు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఏం జరిగిందంటే: 2021వ సంవత్సరం జనవరి 28న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారులు దాదాపు 105 కిలోల వెండి ఆభరణాలను, రెండు లక్షల ఐదువేల నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే, వాటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తనిఖీ అధికారులు వెండి, నగదును సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో సీఐగా విధులు నిర్వర్తించిన విక్రమసింహకు అప్పగించారు. దాంతో పోలీసులు ఆ వెండిని, నగదును పోలీస్ స్టేషన్‌లోని బీరువాలో ఉంచి ఓ మహిళా కానిస్టేబుల్‌కు వాటి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

ముగ్గురు సీఐలు బదిలీ: ఆ తర్వాత సీఐ విక్రమసింహ బదిలీ అయ్యారు. అనంతరం ఆ స్టేషన్‌లో సీఐలుగా కంబగిరి రాముడు, శేషయ్య పనిచేసి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సీఐ రామలింగయ్య పని చేస్తున్నారు. వెండి ఆభరణాలు, నగదు సీజ్ చేయబడిన రోజు నుంచి ఇంతవరకూ వెండికి సంబంధించిన వ్యాపారులు స్టేషన్​కు రాలేదు. అయితే, ఈనెల 27వ తేదీన వెండి యజమానులు న్యాయస్థానం నుంచి అనుమతి పొంది కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెండి, నగదు అప్పగించమని సీఐని అడిగారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూడగా.. అసలు బీరువాలో 105 కిలోల వెండి గానీ, డబ్బు గానీ లేకపోవడంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. పోలీస్ స్టేషన్‌లో దాచిన వెండి, నగదు కనిపించకపోవడంతో పైఅధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకూ నలుగురు సీఐలు బదిలీ కావడంతో వారిందరినీ పిలిపించి, విచారిస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.