కర్నూలు జిల్లా నంద్యాల విద్యుత్ ఏడిఈ నందయ్య రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విధుల్లో భాగంగా గురువారం మరమ్మతులకు గురైన నియంత్రికను పరిశీలించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హరినగరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొంది.. ఈ ప్రమాదంలో ఏడిఈ తో పాటు డ్రైవర్ బాషా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
ఇదీచదవండి.పొలం విషయంలో వివాదం... నరికి చంపిన ప్రత్యర్థి వర్గం