కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీగా మద్యం బాటిళ్లు, ఓ కారు, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు ఆదోని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. అనంతరం ఇద్దరిని అదుపులో తీసుకున్నామన్నారు.
అసలేం జరిగిందంటే..
ఆదోని మండలం పెద్ద హరివణం దగ్గర అక్రమ మద్యం తరలింపు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న లక్షా 12 వేల విలువైన అక్రమ కర్ణాటక మద్యాన్ని చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారి జయరాం నాయుడు తెలిపారు. అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. డబ్బులు వస్తాయని ఆశపడి.. జీవితం నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి : గిరిజనులకు భూపట్టాల పంపిణీ.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం