కర్నూలు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆధ్వర్యంలో వరుస దాడులు చేశారు. జిల్లా వ్యాప్తంగా బుధువారం ఒక్కరోజులు 53 కేసులు నమోదు కాగా 75 మందిని అరెస్టు చేశారు. 21 వాహనాలతో పాటు 230 లీటర్ల నాటుసారా,500 కేజీల బెల్లం వివిధ బ్రాండ్లకు చెందిన 344 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందికొట్కురు నియెజకవర్గ పరిధిలో ఆటోలో సీటు కింద తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 బాటళ్లను పోలీసులు స్వాదీనం చేసుకొని ఆటో ను సీజ్ చేశారు.
ఇదీ చదవండి కర్నూలులో లాక్డౌన్ ఆంక్షల్లో స్వల్ప మార్పులు.. మధ్యాహ్నం 2 వరకు దుకాణాలకు అనుమతి