కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామం ఆదర్శ గ్రామాల్లో ఒకటి. గతంలో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవటంతో.. ఊళ్ళో ప్రభుత్వ పాఠశాల నిరాదరణకు గురైంది. విద్యార్థులతో నిండుగా ఉండాల్సిన పాఠశాల వెలవెలపోయింది. దీంతో 2014-15 విద్యా సంవత్సరంలో పాఠశాలను అధికారులు మూసివేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం వల్ల పాఠశాలను తెరవాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. పాఠశాలను తామే అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: టాయిలెట్‌కు వెళ్లాలంటే.. తరగతి ఎగ్గొట్టాల్సిందే!