Students Injured: కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో ప్రాథమిక పాఠశాల గోడ కూలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాలలో నాడు - నేడు పథకం కింద పనులు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా జేసీబీతో పాత పాఠశాల గదులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గది గోడతో పాటు పైకప్పు కుప్పకూలింది. కూలిన పెళ్లలు పక్క గదిలో చదుకుంటున్న విద్యార్థులపై పడ్డాయి. ఉపాధ్యాయురాలు అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకెళ్లారు. ఐతే ఘటనలో 8 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: