ETV Bharat / state

పరువు హత్యలను ప్రభుత్వం ఉపేక్షించదు: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు - ఆంధ్రప్రదేశ్​లో పరువు హత్య తాజా సమాచారం

పరువు హత్యలను ప్రభుత్వం ఉపేక్షించదని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు అన్నారు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజా ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కృషి చేయాలని కోరారు.

sc corporation chairman kanakarao meet adam smith family
ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు
author img

By

Published : Jan 5, 2021, 2:22 PM IST

రాష్ట్రంలో పరువు హత్యల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు తెలిపారు. 4 రోజుల క్రితం ఆడమ్ స్మిత్ పరువు హత్యకు గురైన ఘటనకు సంబందించి.. సీఎం జగన్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి గురజాల వెళ్లిన తనకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించకపోవడం విచారకరం అని అన్నారు.

పరువు హత్యల వంటి ఘటనలను ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. వీటిని రూపుమాపేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. స్మిత్​ హత్యపై ఎస్పీ, కలెక్టర్లతో మాట్లాడినట్టు వివరించారు. ఆస్పరి మండలం బినిగెరి గ్రామంలోనూ దాడుల ఘటనపై చింతిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

ప్రియురాలితో కలిసి అమ్మమ్మ హత్య... అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.