కర్నూలు జిల్లా కౌతాళం మండలం చూడిలో సర్పంచి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విచిత్రం జరిగింది. సర్పంచిగా గెలిచిన లక్ష్మి అనారోగ్యంతో కార్యక్రమానికి గైర్హాజరవడంతో.. ఆమె భర్త ఉప్పలప్పతో పంచాయతీ కార్యదర్శి హుసేనమ్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఘటన జరిగినప్పుడు వీఆర్వో నాగేంద్ర అక్కడే ఉన్నారు.
విషయం తెలుసుకున్న ఎంపీడీవో సూర్యనారాయణ.. సంబంధిత పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేశారు. సర్పంచి లక్ష్మి ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం చేయిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: రౌడీషీటర్ల ఆధిపత్య పోరు..హత్యాయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు