ఇవీ చదవండి
నంద్యాలలో గాడిదలకు పోటీలు..! - Running competitions for Donkeys in Nandhayal
కోళ్ల పందెం, పోట్టేళ్ల పందెం, ఎడ్ల పందెం చూసి ఉంటాం. కానీ మనమెప్పుడు కనివినీఎరుగని పందెం ఒక్కటి ఉంది. అదే గాడిద పందెం. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా..? కర్నూలు జిల్లా నంద్యాలలో. ఈ గాడిద పందెలను జంబులా పరమేశ్వరీ దేవి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
నంద్యాలలో గాడిద పోటీలు
కర్నూలు జిల్లా నంద్యాలలో గాడిద పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణ శివారులో వెలిసిన జంబులా పరమేశ్వరీ దేవి తిరునాళ్ల సందర్భంగా ఈ పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రజకులు తమ గాడిదలను పరుగు బరిలో దింపారు. వంద కిలోల ఇసుక బస్తాను గాడిదపై ఉంచి ఈ పరుగుపందెం నిర్వహించారు. ఎక్కువ దూరం పరిగెత్తిన గాడిదలకు బహుమతులు అందజేశారు.ఆదోనిలో పోలీసుల తనిఖీలు.. రూ. 5 లక్షల 70 వేల నగదు పట్టివేత
ఇవీ చదవండి
ఆదోనిలో పోలీసుల తనిఖీలు.. రూ. 5 లక్షల 70 వేల నగదు పట్టివేత