కరోనా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక రోజు వేతనాన్ని ఇచ్చి.. ఆర్టీసీ కార్మికులు ఉదారత చాటుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల డిపోలో పనిచేస్తూ నలుగురు, బనగానపల్లెలో మరో కండక్టర్.. కొవిడ్ సోకి మరణించారు.
వారి కుటుంబీకులకు రూ. 5 లక్షల చొప్పున ఈరోజు సాయాన్ని అందించారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఆర్టీసీ కర్నూలు రీజనల్ మేనజరు టి. వి. రామన్.. చెక్కులు పంపిణీ చేశారు. సంస్థ ఉద్యోగుల సేవలను ఎంపీ కొనియాడారు.
ఇదీ చదవండి: