కర్నూలు జిల్లా ఉలిందకొండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పగిలి పూలతోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి.. 'లాక్డౌన్ నుంచి నడలించినా..జాగ్రత్తలు తప్పనిసరి'