సచివాలయ వీఆర్వోపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పెత్తనం మంచిది కాదని రెవెన్యూ వీఆర్వో జిల్లా అధ్యక్షుడు జయరామ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సచివాలయ వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి మద్య వివాదం కొనసాగుతోంది. బసపురం గ్రామంలో విధులకు సరిగా హాజరు కాని వీఆర్వోకు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి మెమో జారీ చేశారు.
అయితే మేమో ఇవ్వడాన్ని రెవెన్యూ సంఘం తప్పుపట్టి.. సమావేశం పెట్టి ఖండించారు. జీవో నెంబర్ 149 ప్రకారం మెమో ఇచ్చామని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డి తెలిపారు. దీనిని ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. తమపై పెత్తనం చేయడం సరికాదని.. తహసీల్దార్‌కు మాత్రమే మెమో ఇచ్చే అధికారం ఉందని అన్నారు. మెమో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని జయరామ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు పెడతాం: అమరావతి దళిత ఐకాస