ETV Bharat / state

Deer death: కుక్కల దాడిలో దుప్పి మృతి

author img

By

Published : Jun 14, 2021, 1:47 AM IST

అటవీ ప్రాంతం నుంచి గ్రామ సమీపంలోకి వచ్చిన ఓ దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన దుప్పిని అధికారులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాయచోటి మండలంలో జరిగింది.

Reedbuck died in dogs attack
కుక్కల దాడిలో దుప్పి మృతి

కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో దుప్పి మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలాల్లో దుప్పి మేస్తుండగా.. కుక్కలు గమనించి వెంటపడ్డాయి. పశువుల కాపరులు విడిపించే ప్రయత్నం చేసినా...అప్పటికే శునకాలు దుప్పిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

Reedbuck died in dogs attack
కుక్కల దాడిలో దుప్పి మృతి

వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు అక్కడికి చేరుకుని దుప్పిని రాయచోటి పశు వైద్యశాలకు తరలించే లోపు మృతి చెందిందని పేర్కొన్నారు. దుప్పి మృతదేహానికి ఏడీఏహెచ్ శవ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అగ్నిమాపకశాఖ సిబ్బంది గ్రామస్థుల సమక్షంలో దహనం చేశారు.

ఇదీ చదవండి:

BOY SUICIDE: తల్లిదండ్రుల మందలింపు.. బాలుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.