కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హొళగుంద మండలంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వేదావతి నది పొంగి ప్రవహించింది. పలుచోట్ల పంటలు ముంపునకు గురయ్యాయి. పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కర్నాటక-హొలగుంద మధ్య రాకపోకలు స్తంభించాయి. ప్రధాన రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి