కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో అన్వర్ భాష పెంచుకుంటున్న కుందేలుకు ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది. అన్వర్ బాషాకు కుందేళ్లు పెంచుకోవడమంటే సరదా. ఆయన పెంచుతున్న ఒక కుందేలు శుక్రవారం వేకువజామున ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ పిల్లలను చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన అని ఆళ్లగడ్డ పశు వైద్యులు డాక్టర్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా 4, లేదా 8 కుందేళ్లకు జన్మ ఇస్తుందని, అరుదుగా 12 కుందేళ్లకు జన్మనిచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనివ్వటం చాలా చాలా అరుదు అని అన్నారు.
ఇదీ చూడండి