కర్నూలు జిల్లాలోని కోస్గి సమీపంలోని గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగమైన పులికనుమ జలాశయం వద్ద కర్నూలుజిల్లా నేతలు పూజలు నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్‌కుమార్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిలు ఎత్తిపోతల పథకం విద్యుత్ మోటర్లను ప్రారంభించారు. మోటర్లతో తుంగభద్ర నదిలో ఉన్న వరద నీరు పులికనుమ జలాశయంలోకి పంప్ అవుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే జలాశయం వద్దకు వెళ్లి హారతి ఇచ్చారు. తాగు, సాగునీటి సమస్య ఉన్న సమయంలో నదికి నీరు రావడం సంతోషమన్నారు.
ఇది కూడా చదవండి.