అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు. సలాంకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని.. సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాల్ డేటా సేకరించి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి..