ETV Bharat / state

నిండుకుండల్లా జలాశయాలు - కర్నూలు జిల్లా వార్తలు

కృష్ణా బేసిన్​లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వరదల కారణంగా.. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులించింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.

projects water levels
projects water levels
author img

By

Published : Oct 16, 2020, 5:19 PM IST

కొద్ది రోజులుగా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1704.53 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 127.10 టీఎంసీలుగా నమోదైంది. ఇన్ ఫ్లో 98,270 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,11,279 క్యూసెక్కులు ఉంది.

నారాయణపూర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1612.43 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 34.12 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులో 1,62,848 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,67,718 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1037.86 అడుగులు ఉంది . పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 5.70 టీఎంసీలు. ఇన్ ఫ్లో 4,93,628 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,27,563 క్యూసెక్కులు.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 882.20 అడుగులకు చేరింది.. పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 200.20 టీఎంసీలు. 6,42,283 క్యూసెక్కులు జలాశయంలో చేరుతుండగా.. 7,18,300 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1632.81 అడుగులు ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 100.12 టీఎంసీలు. తుంగభద్రకు ఇన్ ఫ్లో 15,413 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 17,194 క్యూసెక్కులు.

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులు. పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 309.95 టీఎంసీలు. సాగర్ కు ఇన్ ఫ్లో 4,70,228 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,59,853 క్యూసెక్కులు.

పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 174.05 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు పులిచింతల ప్రస్తుత నీటి నిల్వ 44.28 టీఎంసీలు. ఇన్ ఫ్లో 5,34,990 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,33,832 క్యూసెక్కులు. జలాశయాలకు భారీ వరదలు కొనసాగుతుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులకు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.