ఉపయోగించిన పీపీఈ కిట్లను రహదారికి పక్కనే పడేస్తుండటంతో కర్నూలులో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని సుంకేసుల రోడ్డువైపు శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇటీవల కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశాన వాటికలకు తీసుకొస్తున్నారు. బంధువులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత ఆ పీపీఈ కిట్లను సమీపంలో రహదారుల వెంట పడేస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోలన చెందుతున్నారు. వాడిన పీపీఈ కిట్లను ఇలా పారవేయడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం.. ఒకరు మృతి