కరోనా కేసులు తగ్గుతున్నా ప్రజలందరూ అప్రమత్తంగానే ఉండాలని కర్నూలు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ వివేకాంనదరెడ్డి అన్నారు. పండుగలు, తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలు శానిటైజర్లను విరివిగా వాడేలా అవగాహన కల్పించాలని ఆటోలకు పోస్టర్లు అంటించారు. డ్రైవర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. దుర్గంధభరితంగా వ్యవసాయ మార్కెట్