ETV Bharat / state

ఆదాయం సరిపోక.. చోరీకి యత్నం - attempted to atm theft news

ఏ పనిలేక దొంగతనాలకు పాల్పడేవారుంటారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేసేవారుంటారు. ఉద్యోగం ఉండి ఆదాయం సరిపోక ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఈ ఘటన జరిగింది.

arrest
పోలీసుల అదుపులో నిందితుడు
author img

By

Published : Feb 6, 2021, 7:57 AM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన ఊదర అభిషేక్ విద్యుత్ శాఖలో ఒప్పంద పద్ధతిలో జూనియర్ లైన్​మెన్​గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను.. తనకు నెలకు వచ్చే వేతనం రూ.15 వేలు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసి చోరీకి సిద్ధమయ్యాడు. ఇందుకోసం గ్రామంలోని ఎస్​బీఐ ఏటీఎంను ఎంచుకున్నాడు.

రెండు రోజుల క్రితం ఇనుపరాడుతో ఏటీఎంను ధ్వంసం చేసి.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చోరీ యత్నం జరిగిందని గుర్తించిన బ్యాంక్​ మేనేజర్ బ్రహ్మ గుప్తా శ్రీశైలం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్థానిక ఎస్సై మల్లికార్జున తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్​తో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రెండు రోజుల వ్యవధిలోనే దొంగను అరెస్టు చేసినట్లు సీఐ బి.వి.రమణ తెలిపారు. నిందితుడిని ఆత్మకూరు కోర్టులో హాజరు పరచి రిమాండ్​కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ... లక్షల్లో నగదు పట్టివేత..ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.