కర్నూల్ జిల్లా కౌతళం మండలంలో విషాదం చోటు చేసుకుంది. చిరుతపల్లి గ్రామానికి చెందిన కచేరి మల్లయ్య (14) అనే బాలుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కచేరి అంజయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు మల్లయ్య తన నాయినమ్మతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో ఉండగానే ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం కురిసింది. మల్లయ్య వెంటనే పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో మల్లయ్య మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇది చదవండి: July 9 Horoscope: నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి