కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని కొండజుటూరు గ్రామంలో విషాదం జరిగింది. చల్లా సుబ్బారాయుడు(40) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన సుబ్బారాయుడు ఏడు సంవత్సరాల నుంచి గౌండ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబంతో ఉండటానికి సొంత ఇల్లు లేదని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య కృష్ణవేణి పోలీసులకు తెలిపారు. శవపరీక్ష పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చూడండి