కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాకు రూ. 6,850 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు.
పంటను తీసుకొచ్చే రైతులు తమ పేర్లను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎకరాకు 30 క్వింటాలు, ఒక రైతు వద్ద గరిష్ఠంగా 40 క్వింటాళ్ల పసుపును కొంటామని.. కొనుగోలు కేంద్రం అధికారి జి. రాజు తెలిపారు. ఇక్కడకు 18 మండలాల నుంచి రైతులు పంటను తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.
ఇవీ చదవండి: