కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన మద్దుల మహేశ్వర్ రెడ్డి.. తన స్నేహితుడైన పత్తి వ్యాపారి కమల్‌కు రూ.16 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అనంతరం తన డబ్బులు ఇవ్వాలంటూ మహేశ్వర్ రెడ్డి.. కమల్‌ను అడగగా.. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, ఇప్పుడు ఇవ్వలేనని బదులిచ్చాడు. ఈ ఘటనపై పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టినా లాభం లేకుండా పోయింది.
దీంతో ఎలాగైనా తన డబ్బు రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో.. మహేశ్వర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి.. కమల్ లారీలను అడ్డగించి, దారి దోపిడీకి పాల్పడాలని నిర్ణయించాడు. మే 28న నంద్యాలకు పత్తి లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపి, డ్రైవర్ వద్ద ఉన్న రూ.5లక్షలు నగదు, చరవాణిని అపహరించారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఓర్వకల్లు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5 లక్షలు నగదు, స్కార్పియో వాహనంతో పాటు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి.