అధికారుల తీరును వ్యతిరేకిస్తూ.. భాజపా నేతల ఆందోళన - స్థానికసంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్వోసీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంలో అధికారులు సాకులు చూపుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ధర్నాకు దిగారు. స్థానిక పురపాలక కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైకాపాను గెలిపించుకునేందుకే.. ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలకు అధికారులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.