- ప్రశ్న: ఉల్లి ధరలు పెరుగుతున్న క్రమంలో రాయితీ ఉల్లిని ఎక్కడెక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచారు ?
- జవాబు: ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి రైతు బజార్లలో కేజీ రూ.40 కుటుంబానికి కేజీ చొప్పున సబ్సిడీ ధరపై ఉల్లిని అమ్మడం మొదలుపెట్టాం. కర్నూలు నగరంలోని సీక్యాంప్ రైతు బజార్‌లో అందుబాటులో ఉంచాం. మహారాష్ట్రంలోని నాఫెడ్ బఫర్ స్టాక్‌కు రాష్ట్రం తరపున ప్రతి జిల్లాకు ఇండెంట్ ఇచ్చాం. రేపు ఈ ఉల్లిని జిల్లాలోని ఆరు రైతు బజార్లలో అందుబాటులో ఉంచుతాం.
- ప్రశ్న: కర్నూలు జిల్లాలోనే అమ్ముతున్నారా.. వేరే జిల్లాల్లో కూడా అందుబాటులో ఉన్నాయా?
- జవాబు: ఇవాళ్టి నుంచి రాష్ట్రం అంతా మొదలైంది. మహారాష్ట్ర సరకు కోసం వేయి టన్నులకు రాష్ట్రం తరపున ఇండెంట్ పెట్టాం.. కర్నూలు జిల్లాకు మొదటి దశలో వంద టన్నుల ఇండెంట్ పెట్టాం. మహారాష్ట్ర సరుకు వస్తే అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు ప్రతి జిల్లాలో కనీసం ఒక్కో రైతు బజారులో ఉల్లిని అందుబాటులో ఉంచాం.
- ప్రశ్న: కేజీ ఉల్లి ఎంతకు అమ్ముతున్నారు. సబ్సీడీ ఎంత ఇస్తున్నారు ?
- జవాబు: నిన్న కర్నూలు మార్కెట్ యార్డులో రైతుల వద్ద నుంచి కేజీ 45 నుంచి 50 రూపాయల వరకు కొనుగోలు చేశాం. 40 రూపాయలకు సబ్సిడీ ధరపై ఈ రోజు అందుబాటులో పెట్టాం. మహారాష్ట్ర సరుకు రవాణతో కలిపి ఎంతవుతుందనేది బిల్లు వచ్చిన తరువాత తెలుస్తుంది. మొత్తం మీద 50 రూపాయలు పైనే ఉంటుంది.
- ప్రశ్న: కర్నూలు జిల్లాలో రైతుల నుంచి ప్రభుత్వం తరపున ఉల్లిని కొనుగోలు చేస్తున్నారా?
- జవాబు: నిన్న కర్నూలు మార్కెట్ యార్డు నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు పంపడానికి ఉల్లిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాం. క్వాలిటి తక్కువగా ఉండటంతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు మాత్రమే ఇక్కడ నుంచి పంపించాం. మహారాష్ట్ర ఉల్లి రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది.
- ప్రశ్న: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి కొరత ఎందుకు వచ్చింది ?
- జవాబు: అన్ని చోట్ల వర్షాలు ఎక్కువగా ఉండటంతో పంట నష్టం జరగడం, దిగుబడి తగ్గడంతో దేశీయ మార్కెట్ మొత్తం ఉల్లి కొరత ఏర్పడింది.
- ప్రశ్న: ఉల్లి కొరతను ఎప్పటిలోగా అధిగమించే అవకాశముంది?
- జవాబు: మహారాష్ట్ర, గుజరాత్ లో రబీ ఉల్లి డిసెంబర్‌కు వస్తుంది. స్టాడింగ్ క్రాప్ అర్లీ రబీ కూడా డిసెంబరుకు వస్తుంది. నవంబర్ నెల కొన్ని రోజులు మాత్రమే కొంత ఉల్లి కొరత ఉంటుంది. డిసెంబరుకు సర్దుబాటు అవుతుందని అంచనా వేస్తున్నాం.
- ప్రశ్న: ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించారు. తాజాగా దిగుమతులపై ఆంక్షలు ఎత్తి వేశారు. వీటి వల్ల ఎమైనా ఉపయోగం ఉంటుందా?
- జవాబు: కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించడం వల్లే దేశంలో ఉల్లి ధరలు అదుపులో ఉన్నాయి. దిగుమతులపై ఆంక్షలు ఎత్తి వేయడం వల్ల వినియోగదారునికి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి.
- ప్రశ్న: ఇప్పుడు ప్రజలకు సబ్సిడీపై ఇచ్చే ఉల్లి ఎలా ఇస్తున్నారు?
- జవాబు: ఒక కుటుంబానికి ఒక కిలో చొప్పున ఉల్లిని అందిస్తున్నాం
- ప్రశ్న: ధర పెరగడం రైతులకు కలిసి వచ్చే అంశం. రైతులు సంతోషంగానే ఉన్నారని భావించవచ్చా?
- జవాబు: ఈ సారి ఉల్లి పంట దిగుబడి తగ్గిన మాట వాస్తవమే కాని ధర పరంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అదే విధంగా వినియోగదారునికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టాం. దీని వల్ల రైతులకు నష్టం ఉండదు. రైతుకు లభించాల్సిన ధర రైతుకు లభిస్తుంది. అదే విధంగా వినియోగదారులకు అందుబాటులో ఉండాటానికి రైతు బజార్లలో సబ్సిడీ ధరకు అందుబాటులో ఉంచుతున్నాం.
- ప్రశ్న: ప్రజలకు ఏం చెబుతారు.
- జవాబు: ధరలు పెరిగాయని ఆధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రైతుకు మంచి ధర రావడానికే ప్రయత్నిస్తోంది. అదే విధంగా వినియోగదారునికి అందుబాటు ధరలు ఉండే విధంగా ప్రభుత్వం చూస్తోంది.
ఇదీ చదవండి: వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు