
స్కార్పియో వాహనంలో తిరుమలకు వెళుతూ గేదెను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ...ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కడప జిల్లా నందలూరు మండలం ఆల్విన్ కర్మాగారం సమీపంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది స్కార్పియో వాహనంలో తిరుమలకు వెళ్తుండగా.. నందలూరు సమీపంలోని ఆలయం వద్ద తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న గేదెను ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో వీరేష్(20) మృతి చెందగా... కుమార్, విజయ్, కృష్ణ, లక్ష్మీకాంత్ తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడపకు తరలించి... అక్కడినుంచి కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ ప్రమాదంలో వాహనం ఢీకొన్న గేదె కూడా మృతి చెందింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెను తొలగించి నందలూరు పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. విద్యార్థిని ఆత్మహత్య