కర్నూలు జిల్లా నంద్యాలలోని విత్తన ధ్రువీకరణ కార్యాలయంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అథారిటీ సంచాలకులు డాక్టర్. తివిక్రమరెడ్డి మిగతా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ధ్రువీకరించిన విత్తనాన్ని అంతర్జాతీయ స్థాయిలో విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిన కొత్తగా 20 మంది విత్తన ధ్రువీకరణ అధికారుల నియామకం చేపడతామని ఆయన వివరించారు. విత్తనోత్పత్తి దారులు ఈ క్రాప్ నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విత్తన ధ్రువీకరణ అధికారులు గుండ్రేడ్డి వెంకట్రామిరెడ్డి, లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి. పుట్టుకతోనే అంధత్వం.. అయినా ఐఏఎస్‌లో ర్యాంకు