ETV Bharat / state

వైసీపీ రాయలసీమ గర్జన సభకు స్పందన కరవు.. జగన్​ను పొగిడేందుకే అని విమర్శలు

NO RESPONSE FOR SEEMA GARJANA : రాయలసీమ గర్జన సభను సీఎం జగన్‌ను పొగడటానికే పెట్టినట్లు వైసీపీ నేతలు వ్యవహరించారు. రాజకీయేతర ఐకాస నేతలూ చంద్రబాబును విమర్శించి.. అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. న్యాయరాజధాని మినహా రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి డిమాండ్లు సభలో లేవనెత్తక పోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

NO RESPONSE FOR SEEMA GARJANA
NO RESPONSE FOR SEEMA GARJANA
author img

By

Published : Dec 6, 2022, 8:20 AM IST

NO RESPONSE FOR SEEMA GARJANA : రాయలసీమ గర్జన పేరిట వైసీపీ నేతలు కర్నూలులో నిర్వహించిన సభకు సీమ ప్రజల నుంచి ప్రతిస్పందన కరవైంది. నేతలు ప్రసంగిస్తుంటే హాజరైన వారిలో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. చివరకు మూడు రాజధానుల నినాదం చెప్పి చేతులెత్తించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రాజకీయేతర ఐకాస నేతలకు 2 నిమిషాలకు మించి ప్రసంగించడానికి మైకు ఇవ్వలేదు. వైసీపీ నేతలకు ఐదు నిమిషాలకు పైగా సమయమిచ్చినా వారు ప్రసంగాలతో ఆకట్టుకోలేకపోయారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రారంభోత్సవం చేయగా.. మళ్లీ సీఎం హోదాలో జగన్‌ తిరిగి ప్రారంభించారు. సభలో మంత్రి బుగ్గన విమానాశ్రయం పూర్తి చేసింది జగనే అంటూ చెప్పుకొచ్చారు.

సాగునీటి ప్రాజెక్టులకూ పెద్దపీట వేసినట్లు మంత్రులు చెప్పడంతో నిధులిచ్చారా అన్న విమర్శలకు తావిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులయినా సీమ అభివృద్ధికి ఎవరూ ఏమీ చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ఉండి అన్యాయం చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సీమ నుంచే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేశారని మరిచిపోయారా ? లేకపోతే వైఎస్‌ కూడా సీమకు అన్యాయం చేశారని ఒప్పుకొన్నారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

సమీకరణంలోనే చతికిలబడ్డారు: వైసీపీ రాయలసీమ గర్జన సభను లక్షమందితో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావించింది. చివరికి తక్కువ సామర్థ్యం ఉన్న ఎస్టీబీసీ మైదానాన్నే నింపలేని పరిస్థితి. విద్యార్థులు, మహిళలే లక్ష్యంగా ఆంక్షలతో రప్పించాలని ప్రయత్నించినా పనికాలేదు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభించాలని అనుకున్నా.. 11 గంటల వరకు సభలో కుర్చీలు నిండలేదు. వైసీపీ నేతల ప్రసంగం మొదలవగానే విద్యార్థులు, మహిళలు వెనుదిరిగారు. ఎండ ఎక్కువగా ఉండటంతో ప్లకార్డులు నెత్తిన పెట్టుకుని ఇబ్బందులు పడ్డారు. సభ జరుగుతుండగా విద్యార్థులు వెనుదిరుగుతుండటంతో ఇరువైపులా గేట్లు మూసివేయడంతో చాలామంది గోడలు దూకి వెళ్లిపోయారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వేదిక దిగి వచ్చి, వెళ్లొద్దంటూ అభ్యర్థించినా ఫలితం లేకపోయింది.

ఆ నేతలూ రాలేదు: ప్రభుత్వ ఉద్యోగులు కూడా గర్జన సభకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. 5వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో చాలామంది ఉద్యోగులు గైర్హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్‌ వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి సభకు రాలేదు. గర్జనపై ముందు నుంచి సూచనలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

'సీమగర్జన'కు స్పందన కరవు.. జగన్​ను పొగిడేందుకే సభ అని విమర్శలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.