ETV Bharat / state

ఆరోగ్యానికి ఆవాసం..! - New Quarantine centre in kurnool district

కరోనా విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం వచ్చిన 62 నివేదికలు నెగటివ్‌ వచ్చాయి. జిల్లాలో కొత్తగా క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు.

kurnool district
జిల్లాలో కొత్తగా క్వారంటైన్‌ ఏర్పాటు
author img

By

Published : Apr 10, 2020, 5:37 PM IST

కర్నూల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమై తగు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా అనుమానితులను క్వారంటైన్ కేంద్రంలో ఉంచే విధంగా పనుల వేగవంతంగా చేస్తున్నారు. గురువారం శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీని కలెక్టర్ పరిశీలించారు. నగర శివార్లోని టిడ్కో హౌసింగ్‌ కాలనీలో కేంద్రం ఏర్పాటు దిశ పనుల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.హౌసింగ్‌ కాలనీలో ఎన్ని బ్లాకులు ఉన్నాయి.. వాటిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

ఏమైనా మెటీరియల్‌ అవసరమైతే వెంటనే తెప్పించుకోవాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర అన్ని శాఖలకు సంబంధించిన ఇంజినీరింగ్‌ అధికారులు ఇక్కడే ఉండి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎవరూ బయటకు రాకుండా ఇక్కడే క్యాటరింగ్‌ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాలని సూచించారు. హౌసింగ్‌ కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణకు ఓ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబుకు సూచించారు. జేసీ రవి పట్టన్‌శెట్టి హౌసింగ్‌, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర శాఖలకు సంబంధించిన ఇంజినీరింగ్‌ అధికారులతో టిడ్కో హౌసింగ్‌ కాలనీలో ప్రత్యేకంగా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సమీక్షించారు.

మరో రెండు క్వారంటైన్ల ఏర్పాటు

కర్నూలు సమీపంలో మరో రెండు క్వారంటైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. నన్నూరులోని గీతాంజలి కళాశాల వసతిగృహంలో క్వారంటైన్‌ను సిద్ధం చేశారు. టిడ్కో భవనంలో మరో క్వారంటైెన్‌ కేంద్రం ఏర్పాటుకు సన్నద్ధం చేశారు.

189 మంది చేరిక

కరోనా వైరస్‌ కట్టడికి జిల్లాలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన 18 క్వారంటైన్లలో గురువారం సాయంత్రానికి 189 మందిని వైద్య శాఖ చేర్పించింది. దీంతో ఇంతవరకు 1009 మందిని క్వారంటైన్‌లో చేర్చారు. గురువారం 145 మందిని డిశ్చార్జి చేయగా ఇంకా 864 మంది అనుమానితులు క్వారంటైన్‌లో ఉన్నారు. 18 ప్రాంతాల్లో 472 గదులు, 220 హాళ్లల్లో 1955 పడకల సామర్థ్యంతో జిల్లాలో క్వారంటైన్‌ గదులను ఏర్పాటు చేశారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి 29 మంది, డోన్‌ నుంచి 56 మంది, కర్నూలు ట్రిపుల్‌ ఐటీ నుంచి 23 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలినవారు ఇంకా కోలుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.

తరలింపును అడ్డుకున్న గ్రామస్థులు

నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించేందుకు గురువారం పోలీసులు, వైద్య సిబ్బంది వెళ్లారు. గ్రామస్థులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో గుంపులుగా వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు.

ఇదీ చదవండి:

'నెలాఖరు వరకు లాక్​డౌన్ కొనసాగించే అవకాశం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.