ETV Bharat / state

కొవిడ్ నిబంధనల మధ్య నీట్-2020

రాష్ట్రవ్యాప్తంగా 151 పరీక్ష కేంద్రాల్లో జాతీయ ప్రవేశ పరీక్ష నీట్- 2020 ప్రశాంతంగా ముగిసింది. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ... విద్యార్థులు పరీక్ష రాశారు.

కొవిడ్ నిబంధనల మధ్య నీట్-2020
కొవిడ్ నిబంధనల మధ్య నీట్-2020
author img

By

Published : Sep 13, 2020, 7:34 PM IST

Updated : Sep 13, 2020, 7:45 PM IST

వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష -నీట్ 2020 కట్టుదిట్టమైన నిబంధనల మధ్య జరిగింది. రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా... ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

కొవిడ్ నిబంధనల మధ్య నీట్-2020

తిరుపతి అర్బన్ పరిధిలో 24 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 10 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) మార్గదర్శకాల మేరకు... ప్రతి విద్యార్థిని క్షుణ్నంగా పరిశీలించి లోపలికి పంపించారు. విజయవాడలో 40 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించి, లోపలికి అనుమతించారు.

విశాఖలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం విద్యార్థులను లోనికి అనుమతించారు. కర్నూలు జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో 9,500 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. మాస్క్​లు ధరించే విధంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావటంతో పరీక్ష రాసే అవకాశం లేక ఓ విద్యార్థి వెనుదిరిగాడు. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన హుసేన్... ఒంటి గంట 57 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి వచ్చాడు. కాగా... అప్పటికే సమయం అయిపోయిందని అధికారులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నీట్ పరీక్ష రాసేందుకు 1500 మంది విద్యార్థులు హాజరయ్యారు. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో కేంద్రం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

ఇదీచదవండి.

విశాఖ సముద్రంలో టోర్నడో... ఆసక్తిగా తిలకించిన స్థానికులు

Last Updated : Sep 13, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.