నెల్లూరులో....
నెల్లూరు నగరంలో ఫిట్ ఇండియా ర్యాలీని జిల్లా కలెక్టర్ శేషగిరిరావు ప్రారంభించారు. ఈ ర్యాలీని ఆర్ సి గ్రౌండ్ నుండి ఏసి సుబ్బారెడ్డి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విళాఖలో...
అందరం ఆరోగ్యంగా ఉంటే.. దేశం ఆరోగ్య వంతంగా ఉంటుందంటూ విశాఖ జిల్లా చోడవరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిట్ ఇండియా ఆదేశాల మేరకు విద్యార్థులు ర్యాలీ చేశారు.
కర్నూలులో....
వ్యాయమంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. ఫిట్ ఇండియా మువ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆయన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుండి అవుట్ డోర్ స్టేడియం వరకు ఈర్యాలీ కొనసాగింది.