నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసినపుడే ఉత్పత్తిదారునికి..ఆప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మనంద రెడ్డి అన్నారు. కల్తీలేని విత్తనాలను లక్ష్యంగా పెట్టుకొవాలని ఆయన సూచించారు. నంద్యాల ధ్రువీకరణ కార్యలయ ఆవరణలో జరిగిన విత్తనోత్పత్తి దారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విత్తనోత్పత్తిలో అగ్రగామిగా ఉన్న నంద్యాలకు పూర్వ వైభవం తెస్తానన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి సీడ్ హబ్ ఏర్పాటు, సాగునీటి కేటాయింపులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:
'ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రోడ్డెక్కితే... లాఠీఛార్జ్ చేయిస్తారా'