ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తుంటే... ప్రభుత్వం వారి మీద లాఠీఛార్జ్ చేయించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదా అని నిలదీశారు. విద్యార్థుల చదువులు ఆగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి
ఇది విన్నారా.. శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు