'భయపడకండి.. శుభ్రతను పాటించండి' - corona news in nandyala
కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వైద్యశాలలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. పరికరాలు, మందులు అందుబాటులో ఉంచినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ విజయకుమార్ తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని.. శుభ్రత పాటించాలని సూచించారు.