కర్నూలు జిల్లా నంద్యాల రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకులు పంపిణీ చేయడం లేదని ప్రజలు వాపోయారు. సలింనగర్లో ప్రజలు నిరసన చేపట్టారు. అధికారులకు సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న రెండు దుకాణాలు తెరిస్తే సమస్య ఉండదన్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పి.. గృహాలకు పంపించారు.
ఇదీ చదవండి : ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్