కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన సూక్ష్మ కళాకారిణి నళిని మనసాని.. ప్రతిభ చాటుకుంది. పెన్సిల్ ముక్కపై దేశ చిత్రం చెక్కి తన దేశభక్తిని ప్రదర్శించింది. సుమారు 3 గంటలపాటు శ్రమించి.. 1.3 సెంటీమీటర్ల పొడవు, 5 మిల్లీ మీటర్ల వెడల్పు గల భారతీయ చిత్రాన్ని పెన్సిల్ పై ఆవిష్కరించింది. డిగ్రీ పూర్తి చేసిన నళిని.. సూక్ష్మ చిత్రకారిణిగా ప్రతిభను చాటుకుంటోంది.
ఇదీ చదవండి: