చెత్త పన్ను వసూలు చెయ్యడానికి వెళ్లిన సచివాలయ సిబ్బందికి కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం నూతనంగా విధించిన చెత్త పన్నును వసూలు చేసేందుకు ముజఫర్ నగర్ కు సచివాలయ సిబ్బంది వెళ్లారు. చెత్త పన్ను చెల్లించాలని సిబ్బంది స్థానికులను అడగ్గా.. ఇష్టం వచ్చినట్లు కొత్త పన్నులు విధిస్తే కట్టేది లేదని సమాధానం ఎదురైంది.
సచివాలయ సిబ్బంది తైరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచడమే కాక ఆస్తి పన్నును భారీగా పెంచారని.. ఎలాంటి పన్నులు కట్టబోమని కాలనీవాసులు తేల్చి చెప్పారు. అమ్మ ఒడి ఇచ్చినట్లే ఇచ్చి అందులో వెయ్యి రుపాయలు పట్టుకుని మిగిలిన డబ్బులను పన్నుల రూపంలో బాదుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
'ట్విట్టర్లో సందేశాలే కాదు.. తెలుగు భాషాభివృద్ధికీ శ్రమించాలి'