ETV Bharat / state

'తిరగలేక చస్తుంటే.. ఆలస్యం చేస్తారా'.. సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఫైర్​ - గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్

MLA Anger On Volunteers: రాష్ట్రంలో నిర్వహిస్తున్న గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో అనుభవం ఎదురవుతోంది. కొన్నిచోట్ల ప్రజలు ప్రశ్నిస్తే కొన్నిచోట్ల స్పందనే లేకుండాపోయింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో సచివాలయ ఉద్యోగులు గడప గడప ప్రభుత్వం కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారని వారిపై స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

MLA
ఎమ్మెల్యే
author img

By

Published : Jan 25, 2023, 5:50 PM IST

MLA Anger On Volunteers: కర్నూలు జిల్లా ఆదోనిలో నాల్గో వార్డులోని సచివాలయ ఉద్యోగులపై స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు సమయానికి రాకపోవడంతో.. తొమ్మిది గంటలకు జరగాల్సిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండు గంటలు ఆలస్యమైంది. అసలే తిరగలేక ఇబ్బంది పడుతుంటే.. మీరు ఇంకా ఆలస్యం చేస్తారా అంటూ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఆగ్రహించారు. సమయానికి రాకుంటే.. సెలవు రోజుల్లోనూ కార్యక్రమం నిర్వహిస్తానని హెచ్చరించారు.

సచివాలయ ఉద్యోగుల పై ఎమ్మెల్యే ఆగ్రహం

తమాషా చేస్తున్నారా ఏమన్న.. పొద్దుగల్ల వస్తాం.. పొద్దుగల్ల పోతాం అని లేదు మీకు. 11 గంటలైంది.. ఇలా చేస్తే సెలవు రోజు కూడా తిప్పుతా మిమ్మల్ని. మేమేమో తిరగలేక చస్తుంటే.. మీరేమో ఈ పని పెడతారు.-సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.