ETV Bharat / state

'చంద్రబాబుకే ఓటేస్తా'.. వైకాపా ఎమ్మెల్యేకు వృద్ధురాలి షాక్‌ ! - ఎమ్మెల్యేకు వృద్ధురాలు షాక్

Old Wowan Shock to YSRCP MLA: 'గడప గడప మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని 17వ వార్డులో పర్యటించిన వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓ వృద్ధురాలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాక.. ఓటు ఎవరికేస్తావ్ అని ఎమ్మెల్యే అడగ్గా.. చంద్రబాబుకే వేస్తానని వృద్ధురాలు బదులిచ్చింది. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే..ఏం చేయాలో తెలియక తల బాదుకున్నారు.

వైకాపా ఎమ్మెల్యేకు వృద్ధురాలి షాక్‌
వైకాపా ఎమ్మెల్యేకు వృద్ధురాలి షాక్‌
author img

By

Published : Jul 25, 2022, 3:17 PM IST

Shoxk to YSRCP MLA: కర్నూలు జిల్లా ఆదోని వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి.. ఓ వృద్ధురాలు షాక్‌ ఇచ్చారు. 'గడప గడప మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా 17వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రభుత్వం మీకు ఇన్ని సంక్షేమ పథకాలు అందించిందంటూ వృద్ధురాలి ముందు చిట్టా విప్పారు ఎమ్మెల్యే. కరపత్రంలో ఉన్న పథకాలను పొల్లు పోకుండా చదివారు. అంకెలను విడమర్చి మరీ వివరించారు. అన్నీ అయిపోయాక ఓటెవరికేస్తావ్ అని ఎమ్మెల్యే అడగ్గా.. చంద్రబాబుకు వేస్తానని ఆ వృద్ధురాలు చెప్పేసింది. ఇక అంతే ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక తల బాదుకున్నారు. ఇంతసేపు చెప్పిందంతా వృథా అయిందంటూ ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు నవ్వుకున్నారు.

వైకాపా ఎమ్మెల్యేకు వృద్ధురాలి షాక్‌

ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరో ఇంటికి వెళ్లగా.. ఇంట్లో డిగ్రీ, పీజీ చదివిన ముగ్గురు విద్యార్థులు తమకు మొదటి ఏడాది మాత్రమే విద్యాదీవెన వచ్చిందని.., రెండు, మూడో ఏడాది రాకున్నా వచ్చినట్లు చెబుతున్నారని ఆయన్ను నిలదీశారు. డబ్బులు కడితేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని కళాశాల యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే వద్ద వాపోయారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.