ఇంటి పట్టా లబ్దిదారులతో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా అదోనిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి వైస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని...ఈ నెల 25 న లబ్దిదారులకు ఇంటి పట్టాలను అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం అంటే ఇలా ఉండాలని... దేశానికి ఆదర్శంగా నిలుస్తూ చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియడారు.
ఇదీ చదవండి :
నల్లమల ఘాట్ రోడ్డులో 6 గంటలు ట్రాఫిక్ జాం.. చక్కదిద్దిన పోలీసులు