ETV Bharat / state

దిగుబడి లేక మిర్చి రైతు దిగాలు.. అంతంత మాత్రంగానే ధరలు!

ఎర్ర బంగారం పండించిన రైతన్నకు ఈసారి కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ధర ఉంటే దిగుబడి లేకపోవడం, దిగుబడి ఉంటే ధర పతనమవ్వడంతో నిస్సాహయస్థితిలో పడుతున్న అన్నదాతకు ఈసారీ నష్టాలు తప్పేలాలేవు. ఈ సంవత్సరం దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండగా ధర క్వింటాలు రూ.11 వేల నుంచి రూ.12 వేలలోపు పలుకుతోంది.

Mirch Price come down
దిగుబడి, గిట్టుబాటు ధర లేక మిర్చి రైతు దిగాలు
author img

By

Published : Mar 21, 2021, 5:27 PM IST

కర్నూలు జిల్లాలోని ఆరు మండలాల్లో గత నాలుగేళ్లుగా చీడపీడల బారిన పడడం, తెగుళ్లు సోకడంతో పండు మిరప రైతుకు కన్నీళ్లు మిగిలాయి తప్పితే పెట్టిన పెట్టుబడి సైతం రాలేదు. ఈ ఏడాదైనా లాభాలు వస్తాయని ఆశతో సాగుచేసిన రైతులు దిగుబడులు తగ్గడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాదని, నష్టాలపాలు కావాల్సిందేనని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పెరిగిన సాగు వ్యయం..

ఎకరాకు విత్తనాలు, సేద్యం, ఎరువులు, మందులు, కూలీలు, రవాణా అన్ని కలుపుకుని రూ.1,70,000 వరకు ఖర్చు వస్తోంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 10 క్వింటాళ్ల మాత్రమే వస్తోంది. బ్యాడిగ రకం అయితే క్వింటానికి రూ.16వేల నుంచి రూ.17వేల వరకు ధర పలుకుతుండగా రైతులు ఎక్కువగా సాగుచేసిన సూపర్‌ టెన్‌ రకం క్వింటా రూ.11వేల నుంచి రూ.12వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రైతుకు వచ్చేది రూ.1,44,000 మాత్రమే!

అప్పుచేసి సాగు..

నాకున్న 2 ఎకరాల పొలంలో పండుమిరప సాగుచేశా. రూ.1 లక్ష వరకు అప్పుచేసి పంటను కాపాడుకున్నా. ధర మార్కెట్లో తక్కువగా ఉంది. అప్పుచేసి సాగుచేసినా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. దిగుబడి తగ్గి, ధర తగ్గడంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

దిగుబడిపై తీవ్ర ప్రభావం..

రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పండుమిరప సాగుచేశా. చీడపీడలు, వైరస్‌లు, తెగుళ్లబారిన పడకుండా పంటను కాపాడుకున్నా వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పంటకోసం పెట్టిన ఖర్చులు సైతం వచ్చేది కష్టమనంటున్నారు.

ఇవీ చూడండి...

గోరుముద్ద భారమవుతోంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.