రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం వెనక తెదేపా హస్తముందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో ప్రజల దృష్టిని మరల్చేందుకు తెదేపా ఆలయాలపై దాడులు చేస్తోందన్నారు. ఈ తరహా దాడుల పట్ల సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారని... వీటి వెనక ఉన్న సూత్రధారులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
'రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది పేదలకు ఇంటి స్థలం పట్టాలు అందించాం. అభివృద్ధిలో తమతో పోటీ పడలేక తెదేపా, భాజపాలు.. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేసి జరగబోయే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికతోపాటు ఎక్కడ ఎన్నికలు జరిగినా.. గెలుపు తమదే' అని జయరాం ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: