నకిలీ చలానాల వ్యవహారంపై కడప, నంద్యాల, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా జిల్లా, భీమవరంలలోనూ ప్రాథమిక విచారణ నిర్వహించామని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించిన లావాదేవీలపై విచారణ నివేదిక కోరినట్టు తెలిపారు. ఈ తేదీల మధ్య జరిగిన సీఎఫ్ఎంఎస్ లావాదేవీలను తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి వెల్లడించారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలోని అదనపు ఐజీ ఆధ్వర్యంలో.. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. 813 నకిలీ చలానాల కారణంగా రూ.5.42 కోట్లు ఖజానాకు నష్టం వాటిల్లినట్టు కడప జిల్లా రిజిస్ట్రేషన్ల డీఐజీ ప్రాథమికంగా గుర్తించారని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.1.38కోట్లు రికవరీ అయ్యాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: