కర్నూలు జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారు.. ఓటు వేయటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లారీలు, టెంపో వాహనాల్లో స్వస్థలాలకు వస్తున్నారు.
ఆలూరు:
నియోజకవర్గంలోని 108 పంచాయతీల్లో పోలింగ్ మొదలైంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో వేచి ఉన్నారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం